Posts

Showing posts from February, 2018

ఎట్లనుకుంటే ఎట్లయిపాయే

Image
గలగల పారే  మానేటి అలల్లా ఎగిరి దుంకే  ధిక్కార స్వరం మూగవోయింది  ముంబై పెన్నిధికీ...సిరిశాల సన్నిధికీ  ఆసువోసిన అడుగులు  మౌనంగా కుప్ప కూలినయి  ప్రగతిశీల ఉద్యమాలే  ఊపిరిగా బతికిన సగటు మనిషి  పెన్నుగన్ను శాశ్వతంగా మూలవడ్డది  మట్టి పొత్తిల్లలో  బహుజన భావజాల విత్తులు జల్లిన  నిరంతర సాహితీ కృషీవలుడు కూశైండు   చెట్టుకొగలు పుట్టకొగలుగ కార్మికులం  ఉక్కు పాదాలే ఉక్కిరిబిక్కిరయ్యేట్టు  మేల్కొల్పిన సూత్రధారుడు చుక్కల్ల గల్సిండు  ఒడ్డుకు చేరని ఓడలా  వలస రెక్కల రెపరెలు  తెగిన దారం పోగులా  కన్నపేగుల కలవరింపులు  కంటికేడు ధారలుగ  కవన లోకపు పలకరింతలు  ఉదీమానుల గుండె గూడున  ఉదయించే  ప్రభాకరుడు  ఎట్లనుకుంటే ఎట్లయిపాయే  అయినా ...నువ్వట్లా ! వెళ్ళిపోయేది గాకుండే ? (జనవరి 23,2018న  అమరులైన  కామ్రేడ్ మచ్చ ప్రభాకర్ స్మృతిలో..... )           ----కూకట్ల తిరుపతి      

అమ్మ భాష

Image
ఏటి చెలమ ఊట అమ్మ నోటి మాట పాల మీగడ తేట కోయిలమ్మ పాట జింకపిల్లల ఆట సంప్రదాయపు తోట తరతరాల  మూట లేతకొమ్మల సయ్యాట బంగారు భవితకు బాట    --కూకట్ల తిరుపతి

కవి పరిచయం

Image
పేరు:  కూకట్ల తిరుపతి( My wikipedia )  కలం పేరు: కూతి తల్లి పేరు: అంకమ్మ తండ్రి పేరు: కనకయ్య జీవిత భాగస్వామి పేరు: లక్ష్మి పుట్టిన తేది: 05.06.1975. సొంత ఊరు,మం, జిల్లా:  గ్రామం: మద్దికుంట,  మండలం: మానకొండూర్, జిల్లా: కరీంనగర్. తెలంగాణ రాష్ట్రం.  పిన్: 505 505. విద్యార్హతలు:  ఎం.ఏ. తెలుగు సాహిత్యం. కాకతీయ విశ్వవిద్యాలయం (K.U ), వరంగల్.  టి.పి.టి.(తెలుగు పండిత ప్రశిక్షణ) ప్రభుత్వ ఉపాధ్యాయ విద్యా  కళాశాల(C.T.E ),హన్మకొండ. తెలంగాణ రాష్ట్రం. వృత్తి / ఉద్యోగము: తెలుగు భాషోపాధ్యయులు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల - గంగారం, మండలం: వీణవంక. జిల్లా :కరీంనగర్. తెలంగాణ రాష్ట్రం.  పిన్: 505 502. తపాల చిరునామ: ఇం.నం.1-29/1, గ్రామం: మద్దికుంట. మండలం: మానకొండూర్. జిల్లా: కరీంనగర్.తెలంగాణ రాష్ట్రం.  పిన్: 505 505. ఫోన్ నెం. / చరవాణి సంఖ్య: 99492 47591. వాట్సప్ చరవాణి సంఖ్య :99492 47591. ఈమెయిల్ :kukatlathirupathi75@gmail.com రచనలు: 1.మేలుకొలుపు. (వచన కవితా సంపుటి - 2005) 2.చదువులమ్మ శతకం  (పద్య మకుటం - 2006) 3.పల్లె నానీలు - 2007 ...

మా ఊరి పెద్దర్వాజఫై నా సమీక్ష

Image
మా ఊరి పెద్దర్వాజఫై నా  సమీక్ష 

నా ఎర్రగాలు పుస్తకంఫై డాక్టర్ బండి చంద్రశేఖర్ గారి స్లమీక్ష

Image

నెత్తుటి పునాది

Image
ఆధిపత్యం అసిని దూసినప్పుడల్లా పాట పోరు కెరటమై శోక సంద్రపు తీరాన్ని ముద్దాడింది. బిగిసిన పిడికిలి ఎగిసిన గొంతుక జంగు సైరన్ జమాయించింది. పెత్తందార్ల నెత్తుటి కోటలపై పెట్టుబడిదార్ల పాశవిక పీటలపై   రగల్ జెండా రెపరెపలాడించింది. నిర్బంధపు చీకట్లను చీల్చుతూ మనువు కట్ల పామును తుంచుతూ స్వేచ్ఛాగీతం అగ్గై దునికింది. కరుకు ముండ్ల క్రౌర్యపు   ఇనుప కంచెల గుప్పిట్ల తెలంగాణ రణ నినాదం ప్రజా ఉద్యమ పతాకమై నిప్పు రవ్వలా ఎగిసి ఆరంజ్యోతిగా వెలుగులీనింది. ఎట్టి బతుకులపై కట్టు కథలు కళ్ళల్లో సుడులు తిరిగే కథనాలు   పరాకాష్ఠగా నెత్తురుటేరులు. కాలి గజ్జెలు ఎర్రంచు కర్రె గొంగడి   ఆశు గీతాలు అల్లినై మాటలూ పాటలూ తూటాలై పేలినై అరిగోసపడ్డ తల్లి   అస్తిత్వపు తనువుపై అణువణువునా అణచివేతల గాట్లు   మండే దప్పుల గుండెల పై నిప్పుల దరువు మోతలు   గడ్డి పోచలు గర్జించిన వేళ మదపుటేనుగులు మనగలుగుతాయా ? వనరుల సంరక్షణే ధ్యేయం ప్రజాస్వామిక తెలంగాణే లక్ష్యం   నిప్పు రవ్వలు ఉప్పెనైన తావుల చిక్కనైన నీలి మబ్బు...

ఆకాంక్షల అల్లిక

Image
జీవన తీరాన్ని అల్లుకోని   తెల్లని నవ్వుల పువ్వులు   అల్లకల్లోలపు పోకడల లోకకడలే!   మట్టితో మమేకమైన దేహాల   చెలిమి చెలిమెల చప్పుళ్లు   చేను శెల్కల జీవధాతువులే!   దయార్ధ్ర హృది చూపులు   ద్రవీభూత మనసు పొరలు   బండకుతికి ఆరేసిన ఎండుగ వర్ణాలే!   జీవితాన్ని తడమని   తడిలేని అక్షరాలు   పొడి బట్ట స్వభావమే!   గుండెల్ని తాకని   పద గుంభన రాశులు   ముక్కిపోయిన దినుసు కుప్పలే!   అమృత తుల్యంగా   ఆవిర్భవించు వాక్యం   సుడులు తిరిగే ఆలోచనల్లోంచే!   ఇగిరే రుధిరపు సెగలు   అరిగే ఎముకల ధగధగలు   కవిత్వం ప్రసవ వేదనే !       --కూకట్ల తిరుపతి  

కవిత్వమంటే...?

Image
కవిత్వమంటే..... కాకిరి బీకిరిగా కట్టెపుల్లలతో కాకి గూడు కట్టుకోవడమే కాదు గజిబిజిల పడకుండా కండ్లపండుగోలె గిజిగాడు అపురూపంగా అల్లుకున్న గూడు కవిత్వమంటే..... పూల గుత్తుల అత్తరును బొత్తిగా పిండుకోవడమే కాదు పక్క బొక్కలు తేలినా ! పక్కకు పుత్తెమంతన్నా తప్పుకొనని   చుక్కల లెక్కల్ని తేల్చడం కవిత్వమంటే..... దుక్క బావిలో ఈదులాడడం దరులకయి పాకులాడడమే కాదు తండ్లాట తాడుతో.... తరతరాల దూప తీర్చే బొక్కెడు నీళ్లను తోడుకోవడం కవిత్వమంటే.... నింగికి నిచ్చెనేయడం పాతాళానికి ఫల్టీ కొట్టడమే కాదు మనిషితనానికయి తపిస్తూ అగాథం అంచుల్లో సైతం    అంకెండ్లతో దేవుకోవడం కూకట్ల తిరుపతి 

ఇమాన్దారి....

Image
పక్క బొక్కలు కొట్టుకపోయినా మాట మీదనే నిటారుగ నిలవడుడు మోట గిర్కోలే అటో బొక్కెడు ఇటో బొక్కెడు వోసుడు బొత్తిగ శాతగానోడు పొట్టాపతికి మంది సొమ్ముకు లొట్టలేసుడు అసిద్ధంతో బరాబరీ... కూలీనాలీ మెతుకుల్తో కుడిసే కూడే వెయ్యికి ముడుతదనేటోడు బొంకిచ్చిన కాడల్లా బొక్క బోర్లవడే కుక్కపేగులోడు కడుపుల కసరును సుతా దులిపిచ్చు ఎన్నతడసొంటోడు మాటకు మద్దెల కుదవవడుడు నిట్ట నిలువున మునుగుడుకు   లెక్కా పక్కా లేనేలేదు పెత్తనానికి వోయి పేగులెల్ల దీసుకునుడంటే గిదేనేమో! చేతిల మైల ఊడిందని శాతనే అమ్మోలే నమ్ముకునేటోడు మల్లా పుచ్చుకున్న కాడ పులులం కావచ్చు ! ఇచ్చుకున్న కాడ   ఈగలమేననీ రగుత సవందాలను కండ్లకద్దుకొనేటోడు కాళ్ళకు నీళ్లిచ్చి మందలిచ్చుడు కడుపు నిండార్గ ముచ్చటవెట్టుడు వాయి వరుసలతోటి నెరి పిల్వ నేర్పినోడు పతార పటాపంచలయిన జాగల ఉప్పు పుట్నాలకు కొరగాము బద్నాం బురద కుంటనే బాంచేతనమయితే బద్మాశుది ఇమాన్దారిగ ఎల్లదీసుకోవాలనీ ఇగురం నూరి పోసినోడు          --కూకట్ల తిరుపతి           ...

కలానికి కళ్ళుంటాయి

Image
ఘంటమై తాళపత్రం తడిమినా!                                                                                          మన తెలంగాణ ఆదివారం అనుబంధం హరివిల్లులో  ప్రచురితం  చువ్వై తామ్రపత్రం తాకినా! నెమలీకై ముడుతప్రతి ముద్దాడినా! ఉలై శిలదేహంపై పరుచుకొని సూది మొన కన్న సూటిగా   భూమ్యాకాశాలను గాలిస్తూ   భావాలకు రూపం పోసే   కలానికి కళ్ళుంటాయి   గాలిలో తేలియాడే ఊసులు   రెక్కలు తొడిగిన ఊహలకు   అక్షరాల ఆవాసమల్లుతూ   పేరును పేరిమితో పెనేసి   ఒక వ్యక్తిత్వాన్ని బహుకరిస్తుంది   పంజరంలోని పదపక్షుల   పాదాలు మొలిపిస్తూ   మూగ గొంతు గాయాలకు   గేయ మలాం అద్దుతూ   సాహస ద్వారాలు తెరిపిస్తుంది   పన్నాగాల పల్లేరు కోటల   కుత్సిత కుహరాల కూల్చుతూ   ఆశయాలను దారులుగా ధారవోస్తూ ...