కలానికి కళ్ళుంటాయి


ఘంటమై తాళపత్రం తడిమినా!                                                                                         
మన తెలంగాణ ఆదివారం అనుబంధం హరివిల్లులో  ప్రచురితం 

చువ్వై తామ్రపత్రం తాకినా!
నెమలీకై ముడుతప్రతి ముద్దాడినా!
ఉలై శిలదేహంపై పరుచుకొని
సూది మొన కన్న సూటిగా 
భూమ్యాకాశాలను గాలిస్తూ 
భావాలకు రూపం పోసే 
కలానికి కళ్ళుంటాయి 

గాలిలో తేలియాడే ఊసులు 
రెక్కలు తొడిగిన ఊహలకు 
అక్షరాల ఆవాసమల్లుతూ 
పేరును పేరిమితో పెనేసి 
ఒక వ్యక్తిత్వాన్ని బహుకరిస్తుంది 

పంజరంలోని పదపక్షుల 
పాదాలు మొలిపిస్తూ 
మూగ గొంతు గాయాలకు 
గేయ మలాం అద్దుతూ 
సాహస ద్వారాలు తెరిపిస్తుంది 

పన్నాగాల పల్లేరు కోటల 
కుత్సిత కుహరాల కూల్చుతూ 
ఆశయాలను దారులుగా ధారవోస్తూ 
ఆయువోసుకున్న ఆత్మ విశ్వాసం 
ఆవలి తీరాన్ని తాకిస్తుంది 

అసమ సమాజ స్మశానంలో 
స్వేచ్ఛా విపంచి ఆలాపన 
సాంస్కృతిక సౌరవాలను చల్లుతూ 
కళలీను నేత్ర తెరలపై 
సమరసతా దృశ్యాదృశ్యాలు 

మేల్కొల్పే కలం కాలుచేతులు నరికినా 
ఉరితాడు ప్రాణాలను పెరికినా 
గురి తప్పని ఆయుధమవుతూ 
కదులుతున్న కాలానికి దర్పణంగా 
సదృశ్యమాన సాక్ష్యం. 
  
-- కూకట్ల తిరుపతి 
        

Comments

  1. M Resort Spa & Casino Hotel - Jackson City - JTM Hub
    M Resort Spa 광명 출장마사지 & 용인 출장안마 Casino Hotel, 공주 출장마사지 formerly Jackson City Casino Resort, is celebrating its 20th anniversary, welcoming 창원 출장샵 back more than 40 of 대전광역 출장마사지 the world's most acclaimed performers

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

కవి పరిచయం

పల్లెతల్లి వొల్లెడ