అసిఫా.....బిడ్డా...!

ఎనిమిదేళ్ళబాల గుర్రాల కాపరిపయి
ఎనిమిది మానవతోడేళ్ళ దాడి
అమ్మకు మారు రూపమయిన
అమాయకపు ఆడతనంపై అకృత్యాలు
బేల చూపులను నిర్లజ్జగా చిధిమిన
మత మదపుటేనుగులు
చెంగుచెంగున తిరిగే లేడిపిల్ల కాళ్ళను
విరిచిన కర్కోటక మూక
రాతి బొమ్మల సాక్షిగా
గర్భగుడిలో నిర్బంధం
ఎనిమిది దినాలు ఏకధాటిగా
పసికాయంపై పైశాచికత్వం
కఠిన శిలలను కరిగించలేని
కన్నీటి చారికలు
మేకవన్నె మెకాలను మార్చలేని
నెత్తుటి మరకలు
పసికందుపై మతఛాందసుల మసిగాయాలు
బిడ్డా...! ఆసిఫా......
థూ....ఆక్ ....థూ
కాండ్రించి ఉమ్మతున్న నీ దుర్ఘటన
మేమూ... మనుషులమేనా?
Comments
Post a Comment